రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సమీకృత సముదాయ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఐసిడిఎస్ సిడిపివో జానకమ్మ చిన్నారులకు అన్నప్రాసన చేశారు. తల్లిపాల ప్రాముఖ్యతను బాలింతలకు గర్భిణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీలత, తాసిల్దార్ వెంకటేశం, ఎంపీడీవో సురేష్ బాబు, డాక్టర్ అయేషా సిద్దికా, అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు, ఐకెపి, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.