కోటగిరి శివారు నుంచి అక్రమంగా తరలిస్తున్న మొరం

64చూసినవారు
కోటగిరి శివారు నుంచి అక్రమంగా తరలిస్తున్న మొరం
రుద్రూర్ కోటగిరి శివారు నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను రెవెన్యూ సిబ్బంది శుక్రవారం పట్టుకున్నారు. అనుమతి లేకుండా మొరం తవ్వ కాలు చేపడుతున్నట్లు సమాచారం అందడంతో వెంటనే గుట్ట ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా అక్కడ ఉన్న రెండు టిప్పర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తహసీల్దార్ గంగాధర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్