బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ పట్టణంలో శనివారం చేనేత సహకార సంఘం భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కూరి నారాయణ మాట్లాడుతూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో క్రియాశీల పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.