రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సబ్సిడీ పత్రాలను శుక్రవారం బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజుతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ సబ్సిడీతో పేద మహిళలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సు గొండ, వార్డు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.