నసురుల్లాబాద్: పెద్దమ్మ తల్లి ఆలయంలో ముగ్గుల పోటీలు

75చూసినవారు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం మైలారం పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పలు రకాల ముగ్గులు వేసి రంగులతో నింపారు. ముగ్గులను గ్రామ మాజీ ఎంపీటీసీ ఓళ్ళ మహేందర్ పరిశీలించి, ఉత్తమ ముగ్గులు ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్