రుద్రూర్ గ్రామానికి చెందిన పుట్టి పరువయ్యకు కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో కాలుపోవడంతో ఇట్టి విషయాన్ని రుద్రూర్ మండల నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి పుట్టి పరువయ్యకు బాన్సువాడలో బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, రుద్రూర్ టౌన్ అధ్యక్షులు తోట్ల చిన్న గంగారం, సొసైటీ మాజీ అధ్యక్షులు పత్తి రాము తదితరులు పాల్గొన్నారు.