దేశం గొప్ప ఆర్థికవేత్త నాయకున్ని కోల్పోయిందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని మన్మోహన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.