బహుమతులను ప్రధానం చేసిన శాసన సభాపతి

2023చూసినవారు
బహుమతులను ప్రధానం చేసిన శాసన సభాపతి
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, నాయకులు పోచారం శంభు రెడ్డి తల్లిదండ్రులు కీ శే రాజిరెడ్డి-పాపవ్వ గార్ల జ్ఞాపకార్ధం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న ప్రో కబడ్డి పోటీల విజేతలకు ఈరోజు ఆదివారం బహుమతులను ప్రధానం చేసిన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయిలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ ప్రో కబడ్డి పోటీలలో ఈరోజు ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. ముందుగా స్టేడియంకు చేరుకున్న స్పీకర్ పోచారం ఫైనల్ మ్యాచ్ లను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, కృష్ణా రెడ్డి, గోపాల్ రెడ్డి, నారాయణ రెడ్డి, మోహన్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, పిట్ల శ్రీధర్, ఎజాస్, అలిమొద్దీన్ బాబా, యండి. దావూద్, జలీల్, వహబ్, స్థానిక వార్డు కౌన్సిలర్ హకీం, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్