నూతనంగా నిర్మించిన బ్రిడ్జి, వర్షానికి కొట్టుకు పోతున్న మట్టి, పట్టించుకోని అధికారులు

2387చూసినవారు
నూతనంగా నిర్మించిన బ్రిడ్జి, వర్షానికి కొట్టుకు పోతున్న మట్టి, పట్టించుకోని అధికారులు
బోధన్ పట్టణంలోని నర్సాపూర్ గేట్ వద్ద గల ఇటీవల నూతనంగా నిర్మించిన కొత్త బ్రిడ్జి ప్రారంభం కాకముందే బ్రిడ్జి కి ఇరు వైపులా ఉన్న మట్టి రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకుపోతుంది. దీనితో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. నిజామాబాద్- బోధన్ ప్రధాన రహదారిపై బ్రిడ్జి ఉండడంతో వాహన దారులు రాకపోకలకు ప్రతి రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్