జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును శుక్రవారం హైదరాబాదులోని మంత్రి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్స్ పై సబ్సిడీ ఇవ్వాలని మంత్రి గారిని కోరారు. వరి మరియు సోయా కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా సోయా ఎకరానికి 8 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు.