జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ కరపత్రాలు గురువారం అవిరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడుతూ ఈ నెల 29 న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జుక్కల్ నియోజకవర్గంలో నిర్వహించే బైక్ ర్యాలీ విజయ వంతం చేయాలని కోరారు. మాదిగ బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మాదిగ, మాదిగ ఉప కులాలు కలిసి రావాలని ఆయన సూచించారు.