కంటి వెలుగు రెండో విడత ప్రారంభించిన ఎంపీపీ

479చూసినవారు
కంటి వెలుగు రెండో విడత ప్రారంభించిన ఎంపీపీ
కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోని చిన్నతక్కడ పల్లి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి సర్పంచ్ లక్ష్మి అశోక్ పటేల్ కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ తమ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనాలని కంటి పరీక్షలు చేసుకోవాలని కోరారు.

కంటి వెలుగులో అవసరమైతే కంటి అద్దాలు బాధితులకు అక్కడికక్కడే కళ్ళజోడును అందించడమే కాకుండా అవసరమయ్యే వారికి ఆపరేషన్ కూడా రిమాండ్ చేసి. వాటిని కూడా సంబంధిత ఆస్పత్రిలో చేస్తామని అన్నారు చాలామంది చూపు తక్కువైందని తెలిసి కూడా ఆస్పత్రికి వెళ్ళడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారి కోసమే కెసిఆర్ నేరుగా గ్రామాల్లోకి కంటి వెలుగు చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సర్పంచ్ లక్ష్మీ అశోక్ పటేల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ఆపై వయసు గల మహిళలు, పురుషులు, కంటి సంబంధించిన అన్ని పరీక్షించుకొని రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి విజయవంతం చేయాలని అన్నారు ఆరోగ్య శాఖ చేస్తున్న కంటి వెలుగు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ అనిల్, మాజీ సర్పంచ్ నర్సింగరావు, సొసైటీ డైరెక్టర్ సుభాష్ పటేల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ,వృద్ధులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్