మానవత్వం చాటుకున్న మేము సైతం పౌండషన్ సభ్యులు

2021చూసినవారు
మానవత్వం చాటుకున్న మేము సైతం పౌండషన్ సభ్యులు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పులారే ప్రకాష్ పెంకుటిల్లు కూలిపోవడంతో, పులరే ప్రకాష్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో, కూలిన ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు ఆడపిల్లలు అవస్థలు పడుతున్నా ఆకుటుంబానికి జుక్కల్ మండలానికి చెందిన మేముసైతం ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు స్పందించి సోమవారం 5 రేకుల టీన్ లను ఉచితంగా అందించి తమ ఉదారతను చాటకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శివకుమార్ గౌడ్, పాకలి శ్రీనివాస్, నీరడి రాజు, భానుగౌడ్, మొగులాజీ, ప్రకాష్, పండరి, గణేష్, రవీంధర్, సాయికుమార్, బాలాజీ, కిషన్, సదాశివ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్