వివిధ రకాల వైకల్యం కలిగిన వికలాంగులకు ఉపకరణాలు అలీమ్ కో వారిచే పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. స్థానిక కేవీఎస్ గార్డెన్ లో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని మంగళవారం అలీం కో హైదరాబాద్, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి శిబిరానికి 572 మంది కామారెడ్డి నియోజకవర్గంలోని దివ్యాంగులు హాజరైనారు.