రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశానుసారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకును మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు చాట్ల వంశీకృష్ణ, పాత శివ కృష్ణమూర్తి, ఆకుల రూప రవి, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.