మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కెవిఆర్

73చూసినవారు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కెవిఆర్
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కె. వి. ఆర్ చెప్పారు. శుక్రవారం మున్సిపల్ సానిటరీ కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి సరఫరాలో లోపం లేకుండా చూడాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ సానిటరీ ఎంప్లాయిస్ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్