కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ మహిళా కష్టపడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రతీ మహిళా సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.