నిజామాబాద్ ఏడో బెటాలియన్ లో ఘనంగా సమైక్య దినోత్సవం

68చూసినవారు
నిజామాబాద్ ఏడో బెటాలియన్ లో ఘనంగా సమైక్య దినోత్సవం
డిచ్ పల్లిలోని ఏడో బెటాలియన్ ఆధ్వర్యంలో గురువారం తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్య దినోత్సవాన్ని నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బెటాలియన్ కమాండెంట్ సురేష్ మాట్లాడుతూ హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప నేత అని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్