శేరిలింగంపల్లి: కాంగ్రెస్ విద్యార్థి విభాగం ధర్నా
తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిని మార్చాలని అంటూ సోమవారం హైదరాబాదు నగరంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు ధర్నాకు దిగారు. గత ఆగస్ట్ నెలలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా యడవల్లి వెంకటస్వామిని ఏఐసీసీ నియమించింది. అయితే ఈ నియామకాన్ని కొందరు విద్యార్థి విభాగం నాయకులు వ్యతిరేఖిస్తున్నారు. వెంకటస్వామి ఆంధ్రకు చెందిన వ్యక్తి అని ఆరోపిస్తూ గతంలో నిరసనలు కూడా వ్యక్తం చేశారు.