నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ఎల్లారెడ్డి-నిజాంసాగర్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రమాదాలు సంభవిస్తున్న ఆర్ అండ్ బి అధికారులకు పట్టింపు లేకుండా పోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే దారిలో కల్వర్టు మధ్యన పెద్ద గుంత పడి మర్యాదలు పెరగడంతో ఎల్లారెడ్డి పోలీసులు స్పందించి గుంత పూడ్చేశారు. ఇదే దారిలో నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వ ఉంది. కాల్వ వంతెన వద్ద రోడ్డుపై ప్రమాదకర గుంతలున్నాయి.