ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ పరిధిలోని మత్తడీపల్లి శివారులో వరి పంటలను గురువారం వ్యవసాయ అధికారులు పరిశీలించారు. వరి పంటపై దోమకాటు పురుగు ఆశించిందని, ఈ దోమ కాండం పైన రసం పీల్చడం వలన వరి దుబ్బులు ఆకులు ఎండిపోతున్నాయని, దీంతో దిగుబడి తగ్గిపోతుందని ఏఓ తెలిపారు. రైతులు ఒక ఎకరానికి పై మెట్రో జోన్ అని మందు 120గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని ఏఈవోలు రాజా గౌడ్, ఎస్ఏ ముఖిద్ తెలిపారు.