ఎల్లారెడ్డి సెగ్మెంట్ రైతులను గాంధారి మండల బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్యెల్యే సురేందర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఆరోపించారు. మంగళవారం ఎమ్యెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. రైతులకు కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేసిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రైతుకు ఒక్కపైస రుణమాఫీ చేయలేదన్నారు.