లింగంపేట్ మండలంలోని శెట్ పల్లి గ్రామంలో అడవీ ప్రాంతంలో వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ప్రభు స్వామి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించే జాతర బండ్లు శనివారం ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా అన్నదానం నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రాత్రి రథోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రథోత్సవ వేడుకలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని గ్రామ సర్పంచ్ పద్మాగంగారెడ్డి ఈ సందర్భంగా కోరారు.