ఎల్లారెడ్డి మండలం సాతెల్లి మత్తామాల, మల్కాపూర్, అల్మాజిపూర్, రుద్రారంలో గురువారం కాంగ్రెస్ నేతలు గురువారం గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు వెంకట్రామిరెడ్డి, కృష్ణాగౌడ్, ఉష గౌడ్, బొండ్ల సాయిలు పాల్గొన్నారు.