ఎల్లారెడ్డిలో గణిత ప్రతిభా పరీక్ష

75చూసినవారు
ఎల్లారెడ్డిలో గణిత ప్రతిభా పరీక్ష
ఎల్లారెడ్డి జడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించినట్లు హెచ్ఎం. వి. వెంకటేశ్వర్ రావు తెలిపారు. మండలంలోని 15 ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న 45 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీయడంతో పాటు సమస్యల సాధనలో వారి వేగాన్ని, ఖచ్చితత్వాన్ని అంచనా వేయడం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్