సదాశివనగర్: గుర్తు తెలియని వికలాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు

50చూసినవారు
సదాశివనగర్: గుర్తు తెలియని వికలాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు
సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో గుర్తు తెలియని వికలాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామంలోని డంపింగ్ యార్డు సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్తులు గురువారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతుడు వికలాంగుడని, ఎడమ చేయి లేదని ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే సీఐ సంతోష్ కుమార్ 8712686163, ఎస్సై రంజిత్ కుమార్ 8712686164 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్