విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మూడు రోజుల పాటు సీఎం కప్ - 2024 క్రీడా పోటీలు కొనసాగాయి. గురువారం చివరి రోజున ముగిసిన క్రీడా పోటీల్లో వివిధ విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు రాత్రి బహుమతులను ప్రధానం చేశారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడల పట్ల నిర్లక్ష్యంగా ఉందన్నారు.