రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బేడ బుడగ జంగం సంక్షేమానికి కృషి చేయాలని, ఎల్లారెడ్డి పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ అల్లం శ్రీను అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాలలో జరిగిన బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశానికి ఎల్లారెడ్డి మండలం నుండి అల్లం శ్రీను అధ్వర్యంలో బేడ బుడగ జంగం సంఘ నాయకులు తరలి వెళ్లారు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఎస్సీ 57 ఉపకులాలకు అందలన్నారు.