నాగిరెడ్డిపేట-ఎల్లారెడ్డి మండలాల రైతులకు వరప్రదాయిని అయిన పోచారం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లింగంపేట, గుండారం పెద్దవాగు ద్వారా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం రెండు అడుగులకు చేరిందని నీటిపారుదల శాఖ డిఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే వరద ఉదృతి పెరిగే అవకాశం ఉందన్నారు.