ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. సుమిత్ర (58) అనే మహిళ తన కుమార్తె మోనికతో కలిసి అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. ఆస్తి విషయంలో తల్లితో మోనిక గొడవ పడింది. కాబోయే భర్త నవీన్, ఫ్రెండ్ యోగేష్‌తో కలిసి తల్లి సుమిత్రను చంపింది. అయితే పోలీసులకు మోనిక స్వయంగా ఫోన్ చేసి పిలిచింది. వారి ముందు నటించింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.