కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామ మాజీ సర్పంచ్ పిప్పల గంగరాజం సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగరాజం మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.