కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రాళ్లపల్లి శివారులోని ఎస్సారెస్పీ వరద కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. మృతుడికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. రెండు రోజుల క్రితం మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. ఆత్మహత్యనా, ప్రమాదవశాత్తుగా మృతి చెందాడ అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.