భక్తులతో సందడిగా మారిన అంజన్న క్షేత్రం

62చూసినవారు
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో, ప్రముఖులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరం కావడంతో బుదవారం వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్