కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కొండగట్టు గుట్ట పైన గల వై జంక్షన్ వద్ద ఆదివారం మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. మా ఉద్యోగ వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చూడండి స్వామి అని వేడుకున్నారు.