మృతుడి కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

58చూసినవారు
మృతుడి కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత
మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం జలంధర్ గౌడ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని మన నేస్తం హెల్పింగ్ ఫౌండేషన్ సభ్యులు పరామర్శించి ఆ కుటుంబానికి 75 కిలోల రైస్ బ్యాగులు ఒక నెలకు సరిపడే నిత్యవసరాల సరుకులు బుధవారం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసరి గణేష్(ఆర్మీ), కొరేపు వెంకటేష్, మ్యాదరి లవన్ కుమార్, బెత్తపు చందు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్