గంగాధర మండలంలోని గురుకుల పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు యోగ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర పాల్గొన్నారు. అనంతరం బొంతల కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ. యోగా శారీరక, మానసిక ప్రయోజనాలను కలిగి ఉందని, యోగ అభ్యసనంలో శ్వాస భంగిమలు, ధ్యాన యోగం, మానసిక వ్యాయామాలు వంటి అనేక శారీరక పద్ధతులు ఉంటాయన్నారు.