రాష్ట్ర వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న రెండు మూడు రోజులలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగిందని గొల్లపల్లి ఎస్సై సతీష్ కుమార్ ఆదివారం అన్నారు. ప్రజలు అత్యవసరం ఉంటె తప్ప ఇంటి నుండి బయటకు వెళ్లొద్దని, తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే 100 కాల్ చేయమని అన్నారు.