ఎండపల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుక ఘనంగా నిర్వహించారు. అహింసాయుధం ధారి మహాత్ముని 155వ జయంతి భారత స్వాతంత్ర్య ప్రధాతకు పలువురు ఘన నివాళులు అర్పించారు. సంఘం అధ్యక్షుడు నగేష్, తిరుపతి, మల్లన్న, రాజేందర్, సుధీర్, స్వామి, రవి కిరణ్, రవి, చందు తదితరులు పాల్గొన్నారు.