పుష్య బహుళ పంచమి సందర్భంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించి, ప్రధానాలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.