కరీంనగర్లోని 21వ డివిజన్లో అంగన్వాడి కార్యాలయంలో శుక్రవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజియా మరియ హ్యూమన్ రైట్స్ మహిళా స్టేట్ సెక్రెటరీ పాదం అజంతా పాల్గొన్నారు. ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అరోగ్య మహిళ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పాదం అజంతా తెలిపారు.