లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు నీరు అందించాలని సోమవారం మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయిబాలకిషన్ అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో మిడ్ మానేరు ప్రాజెక్ట్ క్రింద వల్లంపట్ల, వెల్జీపూర్, ఓగులాపుర్, గూడెపు పల్లె, ముస్కుపల్లె, చీర్లవంచ, గ్రామాల రైతులు భూమిని కోల్పియినారు. వారు ఎగువబాగమున ఉన్నారు కావున కాలువల ద్వార నీరు అందించే సౌకర్యం లేదు కాబట్టి లిప్ట్ ఇరిగేషన్ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రికి, నీటి పారుదలశాఖ మంత్రికి విన్నవించారు.
లిప్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే వెల్జీపూర్ పైన ఉన్న బానప్ప చెరువు, ఊరు చెరువు నిండి అక్కడి నుండి వల్లంపట్ల బతుకమ్మ చెరువు నిండుతదని పేర్కొన్నారు. ఈదే పైపు లైనుకు ఓగులాపుర్ గూడెపుపల్లె మద్యల గేట్ల దగ్గర లింక్ ఇస్తే ఓగులాపూర్ లోని కొత్త చెరువు, అక్కడి బావని చెరువు, రాయికుంట , గూడెపు పల్లె లొట్లకుంట చెరువులు నిండుతాయన్నారు. చెరువులు నిండి ఆయా గ్రామాల రైతులకు 5వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.