జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎంపివో రామకృష్ణా రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో ఈ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రాగా ఉన్నతాధికారులు జారీ చేసిన మెమోకు బదులివ్వకుండా, ఆదేశాలు పాటించకూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడని విచారణలో తెలినందున ఎంపివోను సస్పెండ్ చేశామని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.