కోడిగుడ్డు వివాదం.. మహిళ మృతి

38807చూసినవారు
కోడిగుడ్డు వివాదం.. మహిళ మృతి
జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రమ(40) కూతురు వాణి, అదే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్‌ అనే యువకుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లి రమ నిరాకరించింది. కక్ష పెంచుకున్న ప్రకాశ్‌ హోలీ పండుగ రోజు రమ ఇంట్లోకి కోడిగుడ్డు విసిరాడు. దీనిపై మొదలైన వివాదం ముదిరి ప్రకాశ్‌ కొడవలితో రమ మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రమ చికిత్స పొందుతూ మరణించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్