జగిత్యాల: ఫోక్ సింగర్‌ మల్లిక్ తేజకు హైకోర్టులో ఊరట

77చూసినవారు
జగిత్యాల: ఫోక్ సింగర్‌ మల్లిక్ తేజకు హైకోర్టులో ఊరట
యువతిపై లైంగికదాడికి యత్నించారనే కేసులో తెలంగాణ ఫోక్ సింగర్, రైటర్ మల్లిక్ తేజకు ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. డబ్బుల కోసమే తనను యువతి ఇబ్బందులకు గురి చేసిందని మల్లిక్ పేర్కొన్నారు. మల్లిక్‌పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. కాగా, ఇటీవల ఓ ఫీమేల్ సింగర్ అత్యాచారం చేశాడాని ఆరోపిస్తూ జగిత్యాల పీస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్