గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురై వారం రోజుల కింద జగిత్యాల ఆస్పత్రిలో చేరాడు. అతనికి సాయంగా భార్య మల్లవ్వ వచ్చి ఉంటోంది. ఆమె హై బీపీతో బాధపడుతూ సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డుపై పడేశారు. దీంతో భర్త ఆమె వద్దకు వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న దంపతులను చూసిన స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఆ దంపతులను ఆస్పత్రికి తరలించారు.