జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీ నగర్ లో 18 కోట్ల తో నాలుగు వరుసల బ్లాక్ స్పాట్ రోడ్డు ఏర్పాటు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో 2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.