నాగారంలో దారుణం
జమ్మికుంట మండలం నాగారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.