కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ బిల్డింగ్ సముదాయ భవనంలోని రెండవ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.