తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండి ఎస్సై వివేక్ వివరాల ప్రకారం. కరీంనగర్ లోని గణేశ్ నగర్ లో నివాసం ఉంటున్న సత్తు రఘు (48) పట్టణంలోని ఓ హోటల్లో అకౌంటెంట్ గ పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి బయలుదేరి ఇందిరా నగర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.