కరీంనగర్ నగరపాలక సంస్థ నీటి శుద్ధికరణ కేంద్రాన్ని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించారు. వచ్చే వర్షాకాలంలో కొత్తనీరు వచ్చి చేరే అవకాశం ఉంది కాబట్టి. శుద్ధికరణ ప్రక్రియలో తగు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశించారు. నగర నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా స్టాండ్ బై మోటర్లు, జనరేటర్లు వినియోగించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్ పాల్గొన్నారు.